Jukkal | మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన….

Jukkal | మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన….
- జుక్కల్ లో సెంట్రింగ్ లైటింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్
Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ అన్నారు. జుక్కల్ ప్రధాన రహదారి పై దాదాపు నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించునున్న సెంట్రింగ్ లైటింగ్ పనులను కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆమె ప్రారంభించారు. రవాణా సౌకర్యం ఉంటేనే వ్యాపారవృద్ధి, గ్రామాల అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు రోడ్లను అనుసంధానం చేస్తూ ప్రయాణికులకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. సెంట్రింగ్ లైటింగ్ పనులను నాణ్యత యూతంగా, త్వరతిగతిన పూర్తి చెయ్యాలని గుత్తేదారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


