Jukkal | 19న విద్యార్థులకు తెలుగు టాలెంట్ టెస్ట్

Jukkal | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ఈ నెల 19న కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో గల పీఎంశ్రీ హైస్కూల్లో తెలుగు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు లాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.జుక్కల్ మండలంలోని అన్ని హైస్కూల్ లో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు ఖండేబల్లూర్ లోని పీఎంశ్రీ హైస్కూల్లో హాజరు కావాలన్నారు.ఇట్టి అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా జుక్కల్ మండల తెలుగు ఉపాధ్యాయ ఫోరంకు చెందిన రవి,ఖాసీం, భాస్కర్ రావు,సురేష్,నరేందర్,సాధన, లక్ష్మణ్,నరసింహచారి, అంజయ్య,లతా,దేవిసింగ్ రాజశేఖర్ పాల్గొన్నారు.
