jukkal | ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి

jukkal | ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి

  • అసెంబ్లీ గలమెత్తిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

jukkal | జుక్కల్, ఆంధ్రప్రభ: కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోయారైతుల పక్షాన అసెంబ్లీలో ఇవాళ గళ‌మెత్తిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌భ‌తో తెలిపారు. రాష్ట్రంలోనే జుక్కల్ ప్రాంతంలో 28శాతం సోయా పంటను పండించడం జరుగుతుందని, జుక్కల్ నియోజకవర్గం ఈయేడు 75వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను పండించి, దాదాపు ఆరులక్షల క్వింటాళ్ల‌ సోయా దిగుబడిని తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా సోయా కొనుగోలు చేయాల్సి ఉండగా, కఠినమైన షరతులు విధించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు, దళారులకు సోయ పంటను అమ్మి మోసపోవడం జరుగుతుందని ఆయన తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

గత సంవత్సరం కూడా 8వేల క్వింటాళ్ల సోయాను కొనుగోలు చేయకుండానే సోయా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడం జరిగిందని, తాము ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రిని కలిసి జుక్కల్ సోయా రైతుల సాధక బాధకాలను వివరించడంతో స్పందించిన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి తమ వంతు కృషి చేసి సోయా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. అత్యధిక సోయా పంట పండిస్తున్న జుక్కల్ ప్రాంత రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, దీంతో రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. బిచ్కుంద ప్రాంతంలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే తమవంతు సహాయ సహకారం అందించడం జరుగుతుందని, కాబట్టి పెద్ద మనస్సుతో సోయారైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు.

Leave a Reply