ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి..

ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి..

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళల గౌరవాన్ని కించపరిచారంటూ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా, శ్రీశైలం నియోజకవర్గం పి పి మధుసూదన్ రెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, రాష్ట్ర రైతు విభాగం సెక్రెటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రెటరీ శశికళ రెడ్డి,డిమాండ్ చేశారు.

గురువారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అస్రార్ భాషకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ ఛాన‌ల్ అధినేత‌పై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కార్యక్రమంలో మహిళలను, వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు వదిలేసి, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆర్కేతో పాటు ఏబీఎన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పచ్చ పార్టీకి వంత పాడుతూ.. జర్నలిజం ముసుగులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఏబీఎన్ ఆర్కేపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నెల 4వ తేదీన ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ ప్రోగ్రామ్‌లో మహిళలను కించపరిచేలా, అత్యంత అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు పార్టీ నేతలు. జగన్ మోహన్ రెడ్డి చెబితే.. సొంత భార్యలను కూడా చెల్లెళ్లుగా భావించే వెన్నెముక లేని బ్యాచ్ అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయన్నారు.

ఈ వ్యాఖ్యలు కేవలం ఒక పార్టీని విమర్శించడం మాత్రమే కాదని.. మహిళా లోకాన్ని, కట్టుకున్న భార్యలను అవమానించడమేనని నేతలు మండిపడ్డారు. రాధాకృష్ణకు అసలు సంస్కారం ఉందా? నీకు తల్లి, చెల్లి, భార్య లేరా? రాజకీయ విమర్శలు చేయాలంటే నీతిగా చేయాలి. అంతేకానీ, వైసీపీ కార్యకర్తల భార్యల గురించి అంత నీచంగా మాట్లాడతారా? జర్నలిజం పేరుతో నువ్వు చేస్తున్నది అరాచకమని ఫైర్ అయ్యారు. వెంటనే ఆర్కేపై, ఆ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మరోసారి నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. ఖబడ్దార్!”అని హెచ్చరించారు.

ఈ నెల 4వ తేదీన ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్ అందరినీ బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. మహిళలను కేవలం వస్తువులుగా చిత్రీకరిస్తూ, లింగ సమానత్వాన్ని దెబ్బతీసేలా ఆర్కే ప్రసంగాలు ఉన్నాయని వారు ఆరోపించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం స్థానంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఏబీఎన్ వైఖరిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్నామని వైసీపీ నేతలు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ లీగల్ సెల్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి,రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి,స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ శ్రీనివాసులు, జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా వైసిపి అధికార ప్రతినిధి అనిల్ అమృత రాజ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ సెక్రటరీలు శివ నాగిరెడ్డి, దేవానగర్ బాషా,జిల్లా sc సెల్ అధ్యక్షులు తిరుపతయ్య, నంద్యాల అసెంబ్లీ వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ,సాయిరాం రెడ్డి, నంద్యాల అసెంబ్లీ ఎస్టి సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ దూదేకుల సంఘం మహిళా అధ్యక్షురాలు హుస్సేనమ్మ, ఫైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

Leave a Reply