Jharkhand | ఏనుగుల దాడిలో.. ముగ్గురు మృతి

Jharkhand | ఏనుగుల దాడిలో.. ముగ్గురు మృతి
Jharkhand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏనుగుల మంద జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బొకారో టౌన్ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్కీపున్నూ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఏనుగులు ఇంటి గోడలను ధ్వంసం చేస్తున్న సమయంలో, లోపల గణేష్ కర్మాలి, భార్య భగియా దేవి (65), వారి బంధువు కమ్లి దేవి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏనుగులు వారిని కాళ్లతో తొక్కి చంపేశాయి. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
