Manipur | జవాన్ బీభత్సం.. తోటి సైనికులపై కాల్పులు
మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్లిన ఓ జవాన్ బీభత్సం సృష్టించాడు. 120వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సంజయ్ కుమార్ అనే జవాన్.. తన తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. వారిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపు వద్ద ఈ ఘటన జరిగింది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.