jannaram | వృద్ధురాలి ఆత్మహత్య

jannaram | వృద్ధురాలి ఆత్మహత్య

jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాలకు చెందిన చందరాజుల వెంకటరాజవ్వ(62) ఇవాళ ఉద‌యం ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో మెడకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సాయంత్రం తెలిపారు. మృతురాలు భర్త పెద్దలచ్చన్న గత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగాలేక గత కొంతకాలంగా బాధపడుతూ ఉండేదని, ఈనెల 23న రాత్రి కుమారునికి ఫోన్ చేసి బాధపడగా ఓదార్చాడని చెప్పారు. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో మెడకు తాడుతో ఉరి వేసుకుని చనిపోయిందని, కుమారుడు ఇందయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుమారునికి అప్పగించామన్నారు.

Leave a Reply