Jangaon | చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే నా…

Jangaon | జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ ; రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక దాదాపుగా ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ జనగామ మున్సిపల్ తో పాటు మరో 10 మున్సిపాలిటీలో ఎంపిక వాయిదా పడిన విషయం విధితమే. కానీ.. మంగళవారం జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక పార్టీల బలాబలాలు సమానంగా ఉండడంతో ఈరోజు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మున్సిపల్ సమావేశం మందిరంలోకి ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తోపాటు 15 మంది టిఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు.

Leave a Reply