Janasenani | పవన్ కల్యాణ్ దాతృత్వం – న‌టి పాకీజాకు రెండు ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం

హైదరాబాద్ – తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి (Pakiza ) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan ) ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన (janasena) కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ (MLC Hariprasad ), పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ (Giddi satyanarayana ) పాకీజాకు అందజేశారు.

కాగా, పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

Leave a Reply