బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేద్దాం…

బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేద్దాం…

  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ పట్టణ పరిధిలోని 13 మున్సిపల్ వార్డుల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ప్రజల అత్యధికంగా ఆదరించి బీఆర్ఎస్ పార్టీని కి ఓటు వేద్దాం అభివృద్ధికి పాటుపడదామని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు గురువారం 13 వార్డులో ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే. మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు.

పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రణాళికలను కూడా ఆయన ప్రస్తావించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, జనగామ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply