ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపెడతా..

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపెడతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడమంచి సుశీల రమేష్ అన్నారు. గురువారం ధర్మకంచలోని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కడమంచి సుశీల రమేష్ ఇంటింటా ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపెడతారని అన్నారు. ఈ ప్రచారంలో చెంచారపు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
