కొలనుపాకలో వైభవంగా జైన మహావీరుని రథోత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్వేతాంబర జైన దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం మధ్యాహ్నం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జైనాలయంలో మహావీర స్వామి తో పాటు 23 మంది జైనతీర్థంకరులకు పూజలు నిర్వహించిన అనంతరం మహావీరుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి ఆలయ గర్భగుడి ప్రాంగణము నుండి ఊరేగింపుగా బయలుదేరారు. జైనాలయం చుట్టూ రథోత్సవాన్ని నిర్వహించి తులసి తోటలో ముగింపు పూజను జైన పూజారులు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జైనులు ఆలయానికి చేరుకొని పూజలు జరిపి రథోత్సవంలో పాల్గొన్నారు.

Leave a Reply