Jai Shetty Ramanayya | సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Jai Shetty Ramanayya | సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత
Jai Shetty Ramanayya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ చరిత్రకారుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం జగిత్యాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తనకు విద్యాబోధన చేసిన గురువు మరణంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. రమణయ్యతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. సిద్దిపేటలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో తాను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఆయన వద్ద చదివిన రోజులను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రమణయ్య మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, 1971లో సిద్దిపేట జూనియర్, డిగ్రీ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా డా. జైశెట్టి రమణయ్య సేవలందించారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. జగిత్యాలలో తొలి డాక్టరేట్ సాధించిన పరిశోధకుడిగా కూడా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించి పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు.
