రేపు జగన్ ప‌ర్య‌ట‌న‌

రేపు జగన్ ప‌ర్య‌ట‌న‌

తుఫాను బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌

ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి : రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన ముంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి మాజీ సీఎం జ‌గ‌న్ ఈనెల 4వ తేదీన పెడన నియోజకవర్గానికి రానున్నారు. ప్రభుత్వం రైతులకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేస్తూ పెడన నియోజకవర్గంలోని తరకటూరు నుండి రామరాజుపాలెం వరకు తుఫాన్ వల్ల నష్టపోయిన వారి పొలాలను పరిశీలించనున్నారు.

రైతులకు న్యాయం జరిగేలా వారి పక్షాన పోరాడేలా పర్యటన చేస్తున్నారని నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము తెలిపారు. పెనమలూరు పామర్రు మీదుగా పెడన నియోజకవర్గం చేరుకుంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు రాము తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని కూటమి ప్రభుత్వ మంత్రులు సైతం జగన్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జ‌గ‌న్ తొలి పర్యటనగా కృష్ణా జిల్లాలో పర్యటించడం విశేషం.

Leave a Reply