Jaganmata | సేవలో హైకోర్టు జడ్జి

Jaganmata | సేవలో హైకోర్టు జడ్జి
- కుటుంబ సమేతంగా మల్లికార్జునరావు పూజలు
- ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం
Jaganmata | విజయవాడ, ఇంద్రకీలాద్రి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జున రావు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు ఈఈ కోటేశ్వరరావు, ఏఈఓ బీవీ.రెడ్డి ఆలయ మర్యాదలతో ప్రొటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ మల్లికార్జున రావు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఈఈ, ఏఈఓ లు అమ్మవారి ఫొటోతో పాటు ప్రసాదాలను అందజేశారు.
