శ్రీనగర్ – పహల్గాం లో ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం వేట ప్రారంభమైంది. ఆర్మీ, ఎన్ ఐ ఎ, పోలీసులతో కలసి టెర్రరిస్ట్ ల కోసం జల్లెడ పడుతున్నారు.. ఇది ఇలా ఉంటే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది తొలి ఫొటోను విడుదలైంది. ఈ ఫొటోలో ఉగ్రవాది రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు. అతను ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపించాడు. ఈ ఫొటోను నిన్న రాత్రి 1 నుంచి 2 గంటల ప్రాంతంలో జమ్మూశ్మీర్ పోలీసులు… సీఆర్‌పీఎఫ్, సైన్యంతో పంచుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఉగ్రదాడిలో నలుగురు పాల్గొనట్లు గుర్తించారు.. వారంతా ఒకే మోటార్ బైక్ పై సంఘటన స్థలానికి చేరుకున్నారు.. దాడి అనంతరం ఆ బైక్ ను అక్కడికి కొద్ది దూరంలో వదిలి పారిపోయారు.. ఆ బైక్ ను ఆర్మీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.. ఇక ఈ దాడిలో అదిల్ గురీ, అసిఫ్ షేక్ లో పాటు మరో ఇద్దరు పాకిస్తానీయులు పాల్గొన్నారని ఆర్మీ బావిస్తున్నది.. ఇప్పటికే ఈ నలుగురు ఫోటోలు ఎన్ ఐ ఎ కి చేరాయి.. ఈ ఫోటోలను మీడియాకు విడుదల చేశారు… ఇక ఇప్పటికే కే శ్రీనగర్ చేరుకున్న ఎన్ ఐ ఎ బృందాలు ఆర్మీ సహాయంతో ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో పడ్డారు.. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

అతడే మాస్టర్ మైండ్…

పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జుట్ గా అధికారులు అనుమానిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైఫుల్లాను కరుడుగట్టిన తీవ్రవాదిగా గతంలోనే గుర్తించింది. పాక్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని లష్కరే స్థావరం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు.
శ్రీనగర్ చేరుకున్న మృత దేహాలు

ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి మృతదేహాలను శ్రీనగర్ కు తరలించారు.. అక్కడ నుంచి వారి స్వస్థలాలకు విమానాలలో తరలించనున్నారు. ఇక శ్రీనగర్ విమానాశ్రయం లో ఉంచిన మృత దేహాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, గవర్నర్ మనోజ్ సిన్హాలు నివాళులర్పించారు.. అక్కడే ఉన్న బాధిత కుటుంబీకులను ఆయన పరామర్శించారు.. వారికి ధైర్యం చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు..
రూ.10 లక్షల నష్ట పరిహారం
కాగా, మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించారు అమిత్ షా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరుపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే గాయపడిన వారికి సైతం రూ. లక్షల నష్టం పరిహారంతో పాటు ఉచిత వైద్యం అందిస్తామన్నారు.
అనంతరం అమిత్ షా కాల్పులు జరిగిన పహాల్ గామ్ కు వెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. స్థానికుల నుంచి ఘటన వివరాలను సేకరించారు. పోలీస్ . ఆర్మీ ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదులను వదలవద్దని, వేటను ముమ్మరం చేయాలని ఆదేశించారు.. సరిహద్దులలో భద్రత కట్టుదిట్టం చేయాలని సైన్యాన్ని కోరారు.. సరిహద్దు దాటి ఎవరు వచ్చినా కాల్చివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.. ఉగ్రవాదులు ఉండే అనుమానిత ప్రాంతాలలో జల్లెడ పట్టాలని కోరారు.. వీలైతే టెర్రరిస్ట్ లను సజీవంగా పట్టుకోవాలని, లేదంటే స్పాట్ లో హతం చేయాలని అమిత్ చెప్పారు.. ఇది ఇలా ఉంటే ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ నేడు జమ్ము కశ్మీర్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.