వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి మానవాళికి వణుకుపుట్టించి కొత్త సవాలును విసిరింది. అయితే, దానికంటే ముందునుండే మనకు తెలియకుండానే ఒక సూక్ష్మ ఏకకణ జీవి మనిషి ప్రాణాలను బలి తీసుకుంటోంది. అదే నైగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri).
దీనినే మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పిలుస్తాం. ఇది చాలా అరుదుగా కనిపించినప్పటికీ, ఒకసారి సోకితే మాత్రం దాదాపు ప్రాణాంతకమే. ఈ మధ్య కాలంలో భారతదేశంలోని కేరళలో ఈ కేసులు పెరగడంతో వైద్య నిపుణుల్లో ఆందోళన మొదలైంది.
ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయని, వాటిలో 19 మరణాలు సంభవించాయని అధికారులు ధృవీకరించారు. ముఖ్యంగా, గత నెలలోనే మూడు మరణాలు చోటుచేసుకున్నాయి, వీటిలో మూడు నెలల పసికందు కూడా ఉండటం విషాదం. ఈ గణాంకాలు వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి? గుర్తించాల్సిన ముఖ్య లక్షణాలు ఏమిటి? అసలు దీని చికిత్స ఉందా లేదా? తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అవగాహన ఎలా ఉండాలి? ఒకవేళ ఈ వ్యాధి సోకితే వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి?
ఈ అంశాలపై గమన్ హాస్పిటల్స్ డా.నందకిషోర్ విశ్లేషణతో Andhra Prabha Life ప్రత్యేక ఇంటర్వ్యూ.