ISRO | మొరాయిస్తున్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం
బూస్టర్ రాకెట్ లో లోపం
నిర్దేశిత కక్ష్యలోకి పంపే యత్నం విఫలం
శాస్త్రవేత్తలలో ఆందోళన
ప్రయోగం విఫలం కావచ్చనే భయం
రేపు మరోసారి ప్రయత్నిస్తామన్న ఇస్రో
న్యూఢిల్లీ: గత బుధవారం ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్‌వీఎస్-02 శాటిలైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది. ‘నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్‌ను ప్రవేశపెట్టలేకపోయాం. కక్ష్యను పెంచేందుకు శాటిలైట్‌లోని థ్రస్టర్లను మండించే ప్రయత్నం చేయగా, ఆక్సిడైజర్లను అందించే వాల్వ్‌లు తెరుచుకోలేదు’ అని ఇస్రో వెబ్‌సైట్ పేర్కొన్నది. రేపు మరోసారి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
ఇక యూఆర్ శాటిలైట్ సెంటర్‌లో తయారైన శాటిలైట్‌లో సాంకేతిక లోపం కారణంగా ద్రవరూప ఇంధనం మండించలేకపోయారు. దీంతో ఈ మిషన్ ఆలస్యం కావొచ్చు లేదా.. శాటిలైట్‌పై ఆశలు వదులుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. జనవరి 29న శ్రీహరి కోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-02 శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించింది.