మళ్లీ బ్లాక్ బస్టరేనా.. ?

మళ్లీ బ్లాక్ బస్టరేనా.. ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ క్రేజీ కాంబోలో సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. ఇటీవల ఈ మూవీ నుంచి మీసాల పిల్లా.. అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విన్న వెంటనే నచ్చేట్టుగా ఉండడంతో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. అయితే.. ఈ సాంగ్ స్టిల్స్ లో మెగాస్టార్ ను చూస్తుంటే.. ఇరవై ఏళ్ల క్రితం చిరు ఎలా ఉండేవారో అలా ఉన్నాడు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

అయితే.. పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో చిరును అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తున్నాడట అనిల్ రావిపూడి. చిరు గెటప్ చూస్తుంటే.. థియేటర్స్ లో అభిమానులకు పూనకాలే అనేట్టుగా ఉంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీలో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. అయితే.. ఇందులో నయనతార నటిస్తుందని అనౌన్స్ చేసినప్పుడు.. గాడ్ ఫాదర్ మూవీలో చిరుకు సిస్టర్ గా నటించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ జంటగా నటించడం ఏంటి అనే విమర్శలు వచ్చాయి. అయితే.. సినిమా అన్నాకా.. ఒకసారి అన్నా చెల్లెలుగా నటించిన ఆర్టిస్టులు ఆతర్వాత జంటగా నటించడం అనేది నాటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి చిరు, నయన్ కు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే.. పెయిర్ పెర్ ఫెక్ట్ అనేట్టుగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గత సంవత్సరం థియేటర్స్ లోకి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు స్టిల్స్ అండ్ ఫస్ట్ సింగిల్ చూస్తుంటే.. మళ్లీ బ్లాక్ బస్టర్ ఖాయం అనిపిస్తుంది. మరి.. అనిల్ మళ్లీ మ్యాజిక్ చేసేనా..? బ్లాక్ బస్టర్ సాధించేనా..? తెలియాలంటే సంక్రాంతికి వరకు ఆగాల్సిందే.

Leave a Reply