Irumudi | శబరిమలకు అయ్యప్ప స్వాములు

Irumudi | శబరిమలకు అయ్యప్ప స్వాములు
Irumudi | మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన అయ్యప్ప (Ayyappa) స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు. గురుస్వాములు వంశీధర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో స్వాములు భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టుకున్నారు. అంతకుముందు న్యూ సాంగ్వి సన్నిధానంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
