ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

శ్రీకాకుళం, అక్టోబర్ 31(ఆంధ్రప్రభ ): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో శుక్ర‌వారం యూనిటీ మార్చ్ నిర్వ‌హించారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్లు జంక్షన్ డే అండ్ నైట్ మీదుగా అంబేద్కర్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, నాయకులు, అధికారులు హాజరైన ఈ కార్యక్రమం లో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ జరిగింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ దేశ‌ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆడిటోరియం లో నిర్వహించిన యూనిటీ మార్చ్ సభలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరరావు ,డీసీఎంఎ స్ చైర్మన్ అవినాష్, జిల్లా బీజేపీ అధ్యక్షులు తేజేశ్వరరావు, ఆర్డీఓ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ ,మై భారత్ డిప్యుటీ డైరెక్టర్ ఉజ్వల్, సెట్ శ్రీ సీఈఓ,ఎన్ సీసీ కమాండర్ మేజర్ మహేష్,ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply