‎బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ

బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ

‎రేషన్ మాఫియాపై ఉక్కుపాదం

‎బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎బాపట్ల నియోజకవర్గంలో ఒక గింజ రేషన్ బియ్యం దారి మళ్ళినా వదిలేది లేదని, అక్ర‌మార్కుల‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. బుధవారం ఆంధ్రప్రభ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రతీ పేదవాడు వినియోగించుకునేలా సన్న బియ్యం పంపిణీ చేస్తానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

రేషన్ డీలర్ల ఫోన్ నెంబర్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల ఫోన్ నెంబర్లు బహిర్గతం చేస్తామని ఎవరు సమాచారమిచ్చినా వెంటనే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులను ఆయన బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మరో వారం రోజుల్లో క్యాంపు కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని వారి న్యాయబద్ధమైన సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలలోనూ అవినీతి జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకమైన పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు సహకరించాలని సూచించారు.

Leave a Reply