ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం ఢిల్లీలోని జీఎమ్ఆర్ గ్రూప్ కార్యాలయంలో ఢిల్లీ క్యాపిటల్స్ సీఈవో సునీల్ గుప్తాతో సమావేశం అయ్యారు. డిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ స్టేడియం లో జరగనున్న రెండు మ్యాచులపై చర్చించుకున్నారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియం అభివృద్ది పనులు వివరించారు.
ఈ సమావేశానికి హాజరైన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీఈవో గిరీస్ డోంగ్రేలకు సునీల్ గుప్తా పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ విశాఖ ను హోం గ్రౌండ్ గా స్వీకరించి రెండు మ్యాచులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ గ్రౌండ్ లో మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ తో, మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే ఈ రెండు మ్యాచుల నిర్వహణ పై పలు అంశాలు చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎసీఎ సెక్రటరీ , రాజ్య సభ ఎంపి సానా సతీష్; విశాల్ అరోరా, గౌతమ్ గ్రోవర్, గౌరవ్ లు పాల్గొన్నారు.