ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇవాళ 2026 ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2025లో లఖ్‌నవూతో తలపడ్డ నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. దీంతో లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీని ఓడించేందుకు సిద్ధమయ్యారు.గత ఏడాది జట్టులో కీలక ఆటగాళ్లకు గాయాలు కావడంతో పాటు, రిషబ్ పంత్ కూడా ఫామ్‌లో లేకపోవడంతో జట్టు అనుకున్నంతగా రాణించలేకపోయింది.

దీంతో ఈసారి కప్ గెలిచే లక్ష్యంతో పూర్తి ఫిట్‌గా ఉన్న జట్టుతో బరిలోకి దిగుతోంది.పేస్ బౌలర్లు షమి, నోకియా తో పాటు గాయాల నుంచి కోలుకున్న మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ కూడా తిరిగి జట్టులో చేరారు. వీరి రాకతో లఖ్‌నవూ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ బలంగా మారింది.

2026 టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు లఖ్‌నవూని ఓడించిన ఢిల్లీ, ఐదోసారి కూడా గెలవడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ విభాగం: రాహుల్, నిశాంక, స్టబ్స్, అక్షర్, మిల్లర్, అశుతోష్ శర్మ, బౌలింగ్ విభాగం: అకిబ్ నబి, నటరాజన్, చమీర, కుల్‌దీప్ యాదవ్, అక్షర్, దీంతో ఇరు జట్లు సమంగా బరిలోకి దిగుతున్నారు.

Leave a Reply