ipl 2026| ఆల్‌రౌండర్‌కు గాయం

ipl 2026| ఆల్‌రౌండర్‌కు గాయం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు ఆటగాళ్లకు గాయాలు.. మరోవైపు ఫ్రాంచైజీ తీసుకున్న ఓ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహంతో సన్‌రైజర్స్ సతమవుతోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉంది. జట్టులోని ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక సారథిగా ప్రకటించారు.

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. జాక్ ఎడ్వర్డ్స్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో జాక్ ఎడ్వర్డ్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఎడ్వర్డ్స్‌ను ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది.
