సరికొత్తగా వెదుళ్లపల్లి జెడ్పీ హైస్కూల్
ఈ మార్పు చూసేందుకైనా రావాలంటూ విన్నపం
రాజమండ్రి – ఒక్కసారి మా పాఠశాలకు (school ) రండి.. మిమ్ములను చూడాలని ఉంది అంటూ ఓ పాఠశాల విద్యార్థులు(students ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(chandrababu ) , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan ) , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (nara lokesh ) కి ఉత్తరాలు (letters ) రాశారు.. తమ స్కూల్‌లో కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆ విద్యార్థులు.. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ధన్యవాదులు తెలుపుతూ ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. మిమ్మల్ని చూడాలని ఉంది అంటూ ఉత్తరాలు రాశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో కొత్త సౌకర్యాలు కల్పించారు.. విద్యాభ్యాసం లో కూడా మార్పులు చేశారు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ , లంచ్ కూడా స్కూల్లోనే ఇస్తున్నారు. అలాగే ఈ స్కూట్ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ ను తలదన్నేలా సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్స్ చెబుతూ.. ఆ ముగ్గురికి ఉత్తరాలు రాశారు.. స్కూల్ దగ్గరలో ఉన్న పోస్ట్ బాక్స్ లో ఈ ఉత్తరాలు అన్ని పోస్ట్ చేశారు విద్యార్థుల కోరిక మేరకు ముగ్గురిలో ఏ ఒక్కరైనా సీతానగరం పర్యటనకు వచ్చినప్పుడు.. ఆ స్కూల్‌ను సందర్శిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది..