Invitation | తెలుగు ప్రపంచ మహాసభకు ఆహ్వానం

Invitation | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన ఉసావే అధ్యక్షులు, కవిన కోకిల, ఆంగ్ల ఉపాధ్యాయుడు జాదవ్ బంకట్ లాల్ కుఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రమేవ జయతే దివ్యశ్రీ డా. నందమూరి తారక రామారావు ప్రధాన వేదికపై 3వ ప్రపంచ తెలుగు మహాసభకు కవనకోకిల బంకట్ లాల్ కి కవితా గానం ఆత్మీయ ఆహ్వానం దక్కిందిని బంకట్ లాల్ ఇవాళ తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల తోపాటు పలు దేశాల నుండి ఈ ఆంధ్రమేవ జయతే”శ్రీ జాషువా & కరుణశ్రీ కవి సమ్మేళన వేదికలో ఎందరో మేధావులతో పాటు కళాకారులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు పాల్గొని ఈ సభలో ఆయనకు కవిసమ్మేళనంలో కవితాగానంకు ఆహ్వానం దక్కడం ఎంతో అదృష్టంగా ఉందని బంకట్లాల్ తెలిపారు.

అదిలాబాద్ జిల్లా పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బంకట్లాల కవికి ఈ అవకాశం రావడం ఎంతో సంతోషకరమని తడి హత్నూర్ ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ బలిరామ్, ఉపాధ్యాయులు అన్నారు. జనవరి మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు గుంటూరులో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని ఆయన కళను గుర్తించి ఈ కార్యక్రమానికి వారికి ఆహ్వానించారని బంకట్ లాల్ తెలిపారు.

Leave a Reply