ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Former MLA Jagga Reddy) తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే తన బదులు ఆయన భార్య నిర్మల.. సంగారెడ్డి నియోజకవర్గం (Sangareddy constituency) నుంచి పోటీ చేస్తారని తెలిపారు. అయితే పది సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఈ పదేళ్లు రాజకీయాల నుంచి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. అంతేకాక తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం కోసం ఏం చేయాలో.. అంతా చేశానని ప్రజలకు తెలిపారు. దసరా పండగ సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం (Ambedkar Stadium)లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్గారెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.