ఎమ్మెల్యే సహకారంతో విద్యుత్ కెపాసిటర్ల ఏర్పాటు

చిట్యాల, ఆంధ్రప్రభ ; నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామంలో వోల్టేజ్ సమస్యను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు విద్యుత్తు కెపాసీటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని సర్పంచ్ కాటం వెంకటేశం తెలిపారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో వోల్టేజ్ సమస్య పై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే తక్షణమే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి కెపాసిటర్లను మంజూరు చేయించి విద్యుత్ అధికారులు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, పానుగంటి పూజా, నరేష్ ఏదుల, రామిరెడ్డి, విద్యుత్ సిబ్బంది శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
