observation | కేంద్రాలలో ఏర్పాట్ల పరిశీలన..

పరకాల, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ఆదివారం రోజు పరకాల మండలంలోని 10 గ్రామాలకు సంబంధించి నాలుగు క్లస్టర్లు కామారెడ్డి పల్లె, వెల్లంపల్లి, నాగారం, లక్ష్మిపురం క్లస్టర్లను పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, పరకాల ఎంపీడీవో జీ విమల, పరకాల సిఐ క్రాంతి కుమార్ లు ఆయా క్లస్టర్ల సర్పంచ్ నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. వీరితోపాటు పరకాల ఎస్ఐలు విఠల్, రమేష్ ప్రవీణ్ ఉన్నారు.
