inspection | వందలాది సమస్యల విన్నపాలు..

inspection | వందలాది సమస్యల విన్నపాలు..

  • డోన్ రైల్వే స్టేషన్ ఆకస్మిక తనిఖి

inspection | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రైల్వే స్టేషన్లలో పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు అధికారులు వార్షిక తనిఖీలను ఉన్నతాధికారులతో ఏర్పాటు చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ ఈ రోజు గుంతకల్ డివిజన్లోని బళ్లారి నుండి నంద్యాల వ‌ర‌కు తనిఖీలను చేపట్టారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని డోన్ రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.

తనిఖీలలో భాగంగా బిల్డింగ్, ప్లాట్ ఫామ్, లాబీ, రన్నింగ్ రూమ్ లో వ‌చ్చిన వివిధ రకాలైన కంప్లైంట్స్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ లోపల ఉన్న హోటల్లోనూ, ఫుడ్ సెంటర్లోనూ ఆహార నాణ్యతను పరిశీలించారు. డేట్ ఎక్స్పైర్ అయ్యా యా లేక నాణ్యత ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కు రైల్వే స్టేషన్లో ఉన్న సమస్యలను వివరించారు.

కొత్త బుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి, బేతంచర్ల రోడ్డు గోడ సమస్య వంటి పలు అంశాలపై జి ఎంతో చర్చించారు. వందలాది మంది ప్రయాణికులు, పార్టీ నాయకులు సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువచ్చా రు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రయాణికులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply