ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణ పనులపై ఆరా
విజయనగరం, అక్టోబర్ 11(ఆంధ్రప్రభ): ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీటీ కృష్ణబాబు, ఏపీఏడీసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం శనివారం పరిశీలించింది. ట్రంపెట్, ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్, టెర్మినల్ తదితర భవనాలను వారు పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేదు మాధవన్, జిల్లా ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
