లిఫ్ట్ మార్గం మార్పు…

లిఫ్ట్ మార్గం మార్పు…

భక్తులకు మెరుగైన సౌకర్యాలు
మహా మండపంలో అంతర్గతంగా లిఫ్ట్ దారి బెంచీల ఏర్పాటు ప్రారంభం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానం మహా మండపంలో భక్తుల సౌకర్యార్థం కీలక మార్పులు చేపడుతున్నారు. గతంలో బయట నుంచి ఉన్న లిఫ్ట్‌కు వెళ్లే మార్గాన్ని ప్రస్తుతం మహా మండపం లోపలికి మార్చారు. దీంతో భక్తులు ఎండ, వర్షం ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా లిఫ్ట్‌ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. లిఫ్ట్ వద్ద వేచి ఉండే భక్తుల కోసం క్యూ లైన్‌లో స్టీల్ బెంచీలు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి.

భక్తులు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ తమ వంతు కోసం వేచి ఉండేందుకు ఈ ఏర్పాట్లు ఉపయుక్తంగా మారనున్నాయి. ఈ మార్పులను బుధవారం దేవస్థానం ఈవో శీనా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి తదితరులతో కలిసి పరిశీలించారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.

Leave a Reply