Indiramma House Construction | అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు..

Indiramma House Construction | అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు..
- లింబూర్ సర్పంచ్ సుజాత శివారెడ్డి
Indiramma House Construction | డోంగ్లి, ఆంధ్రప్రభ : మండలంలోని లింబూర్ గ్రామంలో ఈ రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు(MLA Thota Lakshmi Kantharao) ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ(Indiramma House Construction) పనులకు సర్పంచ్ సుజాత శివారెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ హన్మంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పురం శషి తదితరులు ఉన్నారు.
