ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup)లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)తో టీమ్‌ఇండియా ( Team India) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కొలంబో వేదికగా జరగనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచి జోష్ మీద ఉంది. నేడు పాకిస్తాన్‌తో తలపడనుంది. బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య ఓటమితో పాక్ ఒత్తిడిలో ఉంది. దీనికి తోడు వన్డేల్లో దాయాది పాక్‌పై భారత్ తమదైన ఆధిపత్యం కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరిగితే అన్నింటా టీమ్‌ఇండియాదే విజయం కావడం విశేషం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
అయితే.. ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు షేక్‌హ్యాంక్ ఇవ్వకపోవడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. నేటి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు కూడా అదే విధానాన్ని ఫాలోకానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ క్రీడాకారిణులతో భారత క్రీడాకారిణులు కరచాలనం చేయరని పేర్కొన్నాయి.