భారత్–వెస్ట్‌ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్వదేశంలో తన మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణించిన భారత్ జట్టు, విండీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
ఇక గాయం కారణంగా రెగ్యులర్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు దూరమవడంతో, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వెస్టిండీతో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచే ప్రారంభం కానుండగా.. ఈ టెస్ట్ పోరు అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది.
ఈ సిరీస్ పూర్తి సిరీస్ షెడ్యూల్, వేదికల వివరాలు….
1వ టెస్ట్ – అక్టోబర్ 2 – అక్టోబర్ 6 | నరేంద్ర మోడీ స్టేడియం – అహ్మదాబాద్. – ఉదయం 9:30 గంటలకు
2వ టెస్ట్ – అక్టోబర్ 10 – అక్టోబర్ 14 | అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ – ఉదయం 9:30 గంటలకు
టెస్టు క్రికెట్‌లో కొత్త శకం…
భారత క్రికెట్‌లో కొత్త తరం నాయకత్వానికి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రతీకగా నిలుస్తున్నాడు. రేపు వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్… కెప్టెన్‌గా స్వదేశంలో గిల్‌కు మొదటి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. దీంతో ఈ సిరీస్‌లో విజయం సాధించి, తన నాయకత్వాన్ని విజయవంతంగా ప్రారంభించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
ఇటీవల జూన్-జూలైలో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఒకానొక దశలో ఓటమి అంచున ఉన్నప్పటికీ, జట్టు అద్భుతంగా పుంజుకుని సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలిగింది. ఈ కంబ్యాక్ ప్రదర్శన భారత టెస్ట్ జట్టులో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు ఆ జోరును కొనసాగిస్తూ, సొంతగడ్డపై కూడా టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటాలని భారత్ జట్టు భావిస్తోంది.
గిల్ కెప్టెన్సీ శైలిలో ధైర్యం, దూకుడు కలగలిసి ఉంటాయి. యువ ఆటగాళ్లపై పూర్తి విశ్వాసం ఉంచుతూ, అదే సమయంలో సీనియర్ ఆటగాళ్ల అనుభవాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. జట్టును సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు గిల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
వెస్ట్‌ఇండీస్‌తో జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ గిల్‌కు కేవలం కెప్టెన్సీ పరీక్ష మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు దీర్ఘకాల నాయకుడిగా తన స్థాయిని, సామర్థ్యాన్ని నిరూపించుకునే ముఖ్యమైన వేదిక కూడా అవుతుంది. స్వదేశీ పిచ్‌లలో ఆడే ఈ రెండు మ్యాచ్‌లు గిల్ నాయకత్వంలో జట్టు బలాన్ని, క్లిష్ట సమయాల్లో గిల్ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలను పరీక్షించనున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో కొత్త కెప్టెన్సీ శకం ఎలా ఉండబోతుందో ఈ సిరీస్ ద్వారా వెల్లడి కానుంది.
వెస్ట్‌ఇండీస్ కంబ్యాక్ పోరు..
వెస్ట్‌ఇండీస్ జట్టు ఆల్‌రౌండర్ రస్టన్ చేజ్ నాయకత్వంలో భారత్‌తో తలపడనుంది. చేజ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన 0-3 ఘోర ఓటమి నుంచి కంబ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత పిచ్‌లపై అనుభవం ఉన్న చేజ్, బ్యాటింగ్, బౌలింగ్‌లలో తన జట్టును ముందుండి నడిపించాలనుకుంటున్నారు.
అయితే, కీలకమైన ఇద్దరు పేసర్లు అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్ గాయాల కారణంగా సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం వెస్ట్‌ఇండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ. కీలక బౌలర్ల గైర్హాజరీలో స్పిన్నర్లపై, అనుభవం ఉన్న బ్యాటర్లపై వెస్టిండీస్ ప్రధానంగా ఆధారపడాల్సి వస్తుంది.
భారత్ చివరిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడినప్పుడు న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ విజయాన్ని ప్రేరణగా తీసుకున్న వెస్ట్‌ఇండీస్, ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.
స్ట్రీమింగ్ డీటెయిల్స్
భారత్ – వెస్ట్‌ఇండీస్ టెస్ట్ సిరీస్ 2025ను భారత క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్‌లోనూ, టెలివిజన్‌లోనూ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
టెలివిజన్ ద్వారా మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ 2 లేదా స్టార్ స్పోర్ట్స్ 2 HD చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అభిమానులు తమకు నచ్చిన భాషలో లైవ్ ని ఎంజాయి చేయవచ్చు.. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లోని ప్రతి క్షణం అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అభిమానులకు లైవ్ యాక్షన్‌గా అందుబాటులో ఉంటుంది.