IND vs SA | టీ20 సిరీస్ భారత్‌దే ..

ఆంధ్రప్రభ : అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ (34), సంజూ శాంసన్ (37) ధాటిగా ఆడి శుభారంభాన్ని ఇవ్వగా, ఆ తర్వాత హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సఫారీ బౌలర్లను చిత్తు చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య (63) కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, భారత్ తరఫున టీ20ల్లో రెండో వేగవంతమైన అర్థ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

T20 Cricket | 20న జట్టు ప్రకటన..
మరోవైపు, తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 బంతుల్లోనే శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
అనంతరం 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 65 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ, భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కీలక సమయాల్లో వికెట్లు తీశారు.

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లతో చెలరేగగా, జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులకే 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. హార్దిక్ పాండ్యకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌ను సఫారీలు నెగ్గగా, వన్డే, టీ20 సిరీస్‌లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది.

IND vs SL | సిరీస్ వేటలో టీమిండియా.. ప్రాక్టీస్ షురూ!
