లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట హోరాహోరీగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 251/4 పరుగులు చేసింది. నెమ్మదిగా సాగిన రోజు, రూట్ – స్టోక్స్ భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను కొంత స్థిరంగా నిలిపింది.
సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి తొలిసారిగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డకెట్, క్రాలీ…. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొని జట్టుకు మంచి ఆరంభం అందించారు.
అయితే, డ్రింక్స్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చురకగా బౌలింగ్ చేసి తన మొదటి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ జోడీగా నిలబడి రెండో సెషన్‌లో ఎలాంటి వికెట్ పడకుండా 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
టీ విరామం తర్వాత వెంటనే రవీంద్ర జడేజా పోప్‌ను (44) వికెట్ వెనుక క్యాచ్‌గా అవుట్ చేయడంతో భారత్‌కు మరో బ్రేక్ లభించింది. తర్వాత బుమ్రా తన ప్రత్యేకతతో హ్యారీ బ్రూక్(11)ను అవుట్ చేసి భారత్‌కు మరో బ్రేక్-త్రూ ఇచ్చాడు.
అయినా జో రూట్ వన్‌మ్యాన్ ఆర్మీలా నిలబడ్డాడు. రోజు ముగిసే సమయానికి 99* పరుగులతో క్రీజులో నిలిచిన రూట్ … తన 37వ టెస్ట్ శతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. కెప్టెన్ స్టోక్స్ తన హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతోనూ క్రీజులో నిలిచి 102 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
జో రూట్: 99(191) బెన్ స్టోక్స్: 39(102)
నితీష్ కుమార్ రెడ్డి: 2 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా: 1 వికెట్
రవీంద్ర జడేజా: 1 వికెట్లా