IND vs ENG | అభిషేక్ వ‌న్ మ్యాన్ షో… ఇంగ్లండ్ ముందు కొండంత టార్గెట్ !

ఐదో టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఓపెన‌ర్లుగా బ్యాటింగ్ కు వ‌చ్చిన శాంసన్‌, అభిషేర్ ఇన్నింగ్స్ ని దూకుడుగా ప్రారంభించారు.

శాంసన్ (16) రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో అదరగొట్టిన ఔట‌వ్వ‌గా.. అభిషేక్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ న‌మోదు చేసి… అదే జోరుతో 37 బంతుల్లో 100 సెంచరీ సాధించాడు. దీంతో టీ20ల్లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన‌ రికార్డు సృష్టించాడు. మొత్తం 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్ల‌తో 135 ప‌రుగులు సాధించి వావ్ అనిపించాడు.

ఇక మ‌రోవైపు తిల‌క్ వ‌ర్మ (24), శివ‌మ్ దూబే (30), రాణించారు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 247/9 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది టీమిండియా. దీంతో 248 ప‌రుగుత విజ‌యల‌క్ష్యంతో ఇంగ్లండ్ జ‌ట్టు చేజింగ్ ప్రారంభించ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *