ఆదాయం.. సంపద సృష్టిద్దాం

కలెక్టర్ల సదస్సులో మంత్రి పయ్యావుల
( ఆంధ్రప్రభ, వెలగపూడి పత్రినిధి) : కొత్త విషయాలను సరి కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీల్ ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 4వ జిల్లా కలెక్టర్ల సమావేశం లో పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మాట్లాడుతూ… ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతిభవించే రీతిలో జిల్లా కలెక్టర్ కృషి చేయాలి. ముఖ్య మంత్రి ఉన్నత స్థాయి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఎదగాలి, ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందచేయాలని సూచించారు.
ఏ ప్రభుత్వంలోనూ ప్రణాళిక శాఖలకు ఎవరు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు, కానీ ఈ సీఎం ఎంతో ఉన్నతంగా ఈ శాఖను వినియోగించు కోవడం వల్ల జీఎస్ డీపీ (GSDP) సాధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపాం, జాతీయస్థాయి జీఎస్ డీపీ 8.8 శాతాన్ని అధిగమిస్తూ 10.8 శాతం రాష్ట్ర జీఎస్ డీపీని సాధించామన్నారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (State economy) లో సమూల మార్పులు తీసుకు వస్తూ రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను సృష్టిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో అంకితభావంతో పనిచేస్తూ 2026 కార్యచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని పిలుపునిచ్చారు.
