SHOPS| సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో..

SHOPS| సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో..

  • దుకాణాలు మూయించివేసిన పోలీసులు

SHOPS| మక్తల్, ఆంధ్రప్రభ : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి (To the city of Maktal) రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు సందర్భంగా పోలీసులు పట్టణంలోని దుకాణాలను ముయించి వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట రోడ్డులోని గురుకుల పాఠశాల (Teacher’s School) వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడులో హెలికాప్టర్ దిగనున్నారు.

అక్కడి నుండి రోడ్డుమార్గం గుండా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి (Sri Padamati Anjaneya Swamy) దేవాలయాన్ని సందర్శించ‌నున్నారు. అనంతరం కొన్ని దశాబ్దాలుగా పాటుపడి తిరిగి పుణరుద్దరించి ఆదివారం రోజు ప్రారంభమైన కోనేరును కూడా ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari)తో పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలోని దుకాణాలు అన్నింటిని మూయించారు. దీంతో వ్యాపారస్తులు వివిధ పనుల నిమిత్తం పల్లెల నుండి వచ్చిన జనం ఇబ్బందులకు గురయ్యారు.

Leave a Reply