ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

కుంటాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండల కేంద్రమైన కుంటాల తాసిల్దార్ కార్యాలయంలోని పార్టీ మండల అధ్యక్షుడు పసుల నవీన్, ఓలా సర్పంచ్ కట్ట రవి, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది మోహన్ సింగ్ కి అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందించడం లేదని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని అన్యాయం చేస్తున్నారని రైతుల పై కక్ష చూపుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 5000 రూపాయలు అందించవలసిన రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదే విధంగా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి అందించాలని వారు పేర్కొన్నారు నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని.. 6 గ్యారంటీలతో కూడిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సువాసిని, రవీందర్, కేశెట్టి అశోక్, సాధు ప్రభాకర్, దిగంబర్, మాజీ ఎంపిటిసి మోహన్, చిన్నన్ రావు, శ్రీనివాస్, బీజేపీ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply