ప్రజా సమస్యలు పరిష్కరించడంలో..

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో..
భువనగిరి/ ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పని చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10, 25, 32 వార్డులలో కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురపాలక సంఘం పరిధిలోని 35 వార్డులలో 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, వార్డుల సభ్యులు బింగి నరేష్, బెండె స్వరూప, లాల్ రాజ్, బర్రె సంఘవి, కరుణాకర్, పాల్త్య వెంకటేష్, జంగిటి వినోద్ కుమార్, బొంతల నర్సింగ్ రావు, తుమ్మేటి పాండు, జాలిగం విగ్నేశ్, సుదగాని సరిత రాజు, సరగడ రాజ్యలక్ష్మి, అమర్, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.
