ఘనంగా ఆదివాసి ఫెస్టివల్స్..

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఐటీడీఏ పీవో, డీడీల దేశాల మేరకు జన్ జాతీయ గౌరవ దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) జైనూర్ మండలంలోని గౌరీ గిరిజన సంక్షేమ శాఖ శాటిలైట్ పాఠశాలలో ఘనంగా ఆదివాసి ఫెస్టివల్స్ల్ నిర్వహించారు.
ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు దీపావళి ఫెస్టివల్ కార్యక్రమాలు ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో జరుపుతుండగా విద్యార్థులకు కూడా ఆదివాసి ఫెస్టివల్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు వారం రోజులపాటు జన్ జాతీయ గౌరవ దినోత్సవ(Jan National Honor Day) వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో తమ పాఠశాలలో దీపావళి ఫెస్టివల్(Diwali Festival) పై వేడుకలు నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరిమల్లె మారుతి తెలిపారు.
వారం రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చివరి రోజు బహుమతులు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన ఆదివాసి సంస్కృతిక దీపాలు ఫెస్టివల్ కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాలప్రధానోపాధ్యాయులు సిరిమల్లె మారుతి, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి, విద్యార్థినీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

