కడెంలో బంద్‌

నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : మెదక్ జిల్లా (Medak District) నార్సింగి మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొన‌సాగుతోంది. 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, కండ్లకొయ్య యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు.


కడెం, ఆంధ్ర‌ప్ర‌భ : క‌డెంలో బంద్ కొన‌సాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (42Percent Reservation) కల్పించాలని డిమాండ్‌తో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీసీపీ, ఎంసీపీఐయూ, సీపీఐ, సీపీఐ ఎంఎల్ ప్ర‌జాపంథా, న్యూడెమోక్ర‌సీ ఆధ్వ‌ర్యంలో బంద్ జ‌రిగింది. మండలంలోని లింగాపూర్, మాసాయిపేట, ఎలగడప బెల్లాల్ తదితర గ్రామాల్లో ఉదయం నుంచే దుకాణాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కార్యక్రమంలో పి.సతీష్ రెడ్డి , రెంకల శ్రీనివాస్ యాదవ్, టి.ధర్మయ్య, పసుపుల వెంకన్న, షేక్ రఫీక్ , పి రాజు, బ్రహ్మచారి, కే రాజేశ్వర్ , రత్నాల రాజేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply