IMAX | అవతార్ హంగామా..

IMAX | అవతార్ హంగామా..

IMAX | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అతిపెద్ద విజువల్ ఈవెంట్ అవతార్ : ఫైర్ అండ్ ఆష్(Fire and Ash). ఈ మూవీ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ గ్లోబల్ ఫ్రాంచైజీ కోసం భారత్‌లో మాస్ హైప్ నెలకొన్న తరుణంలో, IMAX డిసెంబర్ 5 నుంచి నేషన్‌వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్‌(Advance Bookings)ను ఓపెన్ చేయడానికి రెడీ అవుతోంది. దీంతో అవతార్ హంగామా స్టార్ట్ కానుంది. IMAX, డాల్బీ విజన్ స్క్రీన్లలో ఈ ఫస్ట్ డే – ఫస్ట్ షోగా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది.

అవతార్‌ను అత్యుత్తమంగా ప్రెజెంట్ చేయడానికి IMAX ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని IMAX థియేటర్లలో అవతార్-థీమ్‌తో డిజైన్ చేసిన బాక్స్ ఆఫీస్(Box Office) కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. బుకింగ్ ప్రారంభమైన క్షణం నుంచే ఫ్యాన్స్ ఎనర్జీ, ఫోటో సెటప్‌లు, థీమ్‌లతో ప్రాంగణంతో అద్భుతంగా మారబోతోంది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, IMAX బెస్ట్ సీట్స్, బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ కేవలం ముందుగానే బ్లాక్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తుందని చెబుతోంది.

అవతార్ విజువల్స్‌ను భారీ స్కేల్‌లో అనుభవించాలనుకునే ప్రేక్షకులకు ఈసారి పెద్ద అదనపు హైలైట్. మొదటిసారిగా ఈ ఫ్రాంచైజీ డాల్బీ విజన్ సినీ అనుభవంలో కూడా అందుబాటులోకి రాబోతుంది. స్పష్టమైన విజువల్స్, అద్భుతమైన కలర్ డెప్త్ తో అవతార్ ప్రపంచాన్ని మరో స్థాయిలో ఫీల్ చేసే అవకాశం ఇది. జేమ్స్ కామెరన్(James Cameron) సృష్టించిన ఈ మహత్తర గాథ అవతార్ : ఫైర్ అండ్ ఆష్ ను 20th సెంచరీ స్టూడియోస్ డిసెంబర్ 19న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

Leave a Reply