Illegal | పేలుడు పదార్థాల కేసు న‌మోదు..

Illegal | పేలుడు పదార్థాల కేసు న‌మోదు..

  • ముగ్గురు నిందితుల అరెస్ట్
  • భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
  • ఎస్పీ యం. రాజేష్ చంద్ర వెల్లడి

Illegal | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, నిల్వ, రవాణా, అమ్మకం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసు వివరాలలోకి వెలితే 18నరామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పి. రాజశేఖర్ రామారెడ్డి రథాల గైని ప్రాంతంలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా గర్గుల్ గ్రామం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని గమనించారు.

పోలీసులను చూసి వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని విచారించగా వారు ఎటువంటి అనుమతులు లేకుండా జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, వైరులను నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన వరికుప్పల నర్సింలు నుండి కొనుగోలు చేసి గాంధారి మండలంలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండ రాళ్లను పేల్చేందుకు తరలిస్తున్నట్టు తెలిసింది.

వీరు గతంలో కామారెడ్డి పరిసర ప్రాంతాలలో కూడా ఇలా పేలుడు పదార్థాలు ఉపయోగించి బండరాళ్లను పగులగొట్టార‌న్నారు. ఈ విషయములో పలు సెక్షన్ల కింద రామారెడ్డి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామ‌న్నారు. ఎ1 వద్ద నుంచి 50 జెలటిన్ స్టిక్స్, హోండా షైన్ ద్విచక్ర వాహనం (టీఎస్16 ఈఎం 7607), ఒక ఐఫోన్ మొబైల్ ఫోన్ స్వాధీనప‌ర్చుకున్నామ‌న్నారు.

ఎ2 వద్ద నుంచి 6 డిటోనేటర్లు, సుమారు 52 మీటర్ల వైరు, ఒక జియోభారత్ కీప్యాడ్ మొబైల్ ఫోన్, స్వాధీనం చేసుకున్నార‌న్నారు. ఇద్దరు నేరస్తుల సమాచారంతో పోలీసులు నందిపేట్ గ్రామానికి వెళ్లి A3 : వరికుప్పల నర్సింల కుల వృత్తి (స్టోన్ కట్టర్), కొండగడప గ్రామం మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు నందిపేట్ గ్రామం మండలం, నిజామాబాద్ జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింద‌న్నారు.

ఇతను అక్రమంగా పేలుడు పదార్థాలను ఎలాంటి లైసెన్సులు లేని వ్యక్తులకు కూడా అధిక ధరలకు అమ్ముతున్నాడన్నారు. ఎ3 వద్ద నుంచి 20 జెలటిన్ స్టిక్స్, 4 డిటోనేటర్లు, సుమారు 5 మీటర్ల వైరు, ఒక ఒప్పో , మొబైల్ ఫోన్, రెండు రిజిస్టర్స్ స్వాధీన‌ప‌ర్చుకున్నామ‌న్నారు. ఈ విచారణలో పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్న ఎ4 ఓరుసు సాయి మల్లు @ మల్లేష్, మాచర్ల గ్రామం, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా ఇతను ఈ పూర్తి అక్రమ వ్యవహారములో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైందన్నారు.

ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని తెలిపారు. అక్రమంగా పేలుడు పదార్థాల వినియోగం వలన ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగుతుందని తెలిసి కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల‌న్నారు.

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ.రామన్, రామారెడ్డి ఎస్సై రాజశేకర్, మాచారెడ్డి ఎస్సై అనిల్, మహేందర్, సిద్దారాములు కైలాష్ ను జిల్లా ఎస్పీ అభినందించడం జ‌రిగింద‌న్నారు. విలేకరుల సమావేశంలో కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply