లబ్బిపేటలో.. ఇఫ్తార్ విందు..

లబ్బిపేటలో.. ఇఫ్తార్ విందు..

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని లబ్బిపేటలో వై.వి.రావు హాస్పిటల్ రోడ్డులో మైనార్టీ నాయకులు షేక్ సిరాజ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్, బొప్పన భవ కుమార్, చైర్మన్ హషన్ భాషా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం సౌభ్రాతృత్వం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply