Survey|భూసేకరణ సర్వేలో అభ్యంతరాలుంటే తెలుపండి..!

Survey | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక రెవెన్యూ పరిధిలో 3119.94 గ్రామ విస్తీర్ణం ఉండగారీ సర్వే అధికారులు సర్వే చేయగా 3132. 306 విస్తీర్ణం వచ్చిందని మండల తహశీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ తెలిపారు. హక్కుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరిచేస్తామని అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రీ సర్వే చేసిన ముసాయిదా జాబితాను భూహక్కు దారులకు అధికారులు చదివి వినిపించారు. పాల్గొన్న పలువురు భూ హక్కుదారులు వారి సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కైతేపల్లి అంకాలు, కార్యదర్శి జే.పవన్ కుమార్, రీ సర్వే అధికారి శ్రీనివాసరావు, సర్వేయర్ డివసుధీర్, వీ ఆర్వోలు పద్యాల కనక దుర్గ, బి.లింగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
