సర్పంచ్‌గా గెలిపిస్తే గుడిగండ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

  • సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు
  • ముమ్మరంగా ఇంటింటి ప్రచారం

మక్తల్, ఆంధ్రప్రభ: గ్రామ అభివృద్ధి కోసం గుడిగండ్ల గ్రామ ప్రజలు తనను ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు తెలిపారు.

శనివారం ఆయన తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని ఇంటింటికీ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పెద్ద నర్సిములు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో గ్రామ అభివృద్ధికి చేయాల్సిన పనులు చేయలేదని, అభివృద్ధి పూర్తిగా విస్మరించబడ్డదని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి మాత్రమే గుర్తుంచుకునదగ్గదని, కొత్తగా ఏమీ చేయలేదని అన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని, ఇంటింటి ప్రచారం సమయంలో ఎక్కడికీ వెళ్ళినా ప్రజలు అపూర్వ స్వాగతం పలకడంతో, తన గెలుపును ఎవరు అడ్డుకోలేరని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెద్ద నర్సిములు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అభివృద్ధికి నోచుకోలేని సర్పంచ్‌గా గ్రామాన్ని సర్వతోముగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేరే విధంగా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా, నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని, గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం ఇచ్చేందుకు ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply